ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కి రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్

ఢిల్లీలో తొలి సారిగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌ ప్రారంభం అయింది . ఈ చారిత్రక వేడుకకు మెగా పవర్ స్టార్‌, గ్లోబల్ ఐకాన్ రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా హాజరయ్యారు.

తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ – ఢిల్లీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆనంద్ విహార్, ఢిల్లీలో జరిగింది.ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ… “ఆర్చరీ మన చరిత్రలో, సంస్కృతిలో భాగం. ప్రాచీన భారతీయ క్రీడ ఇప్పుడు ఆధునిక లీగ్‌గా మారడం గర్వకారణం. ఇంత చారిత్రక లీగ్‌ని నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు. భారతదేశంలో తొలిసారి ఆర్చరీ లీగ్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఆర్చర్‌కు మేమంతా అండగా ఉంటాం” అని అన్నారు.

ఈ కార్యక్రమానికి ఉచిత ప్రవేశం కల్పించబడింది.అందరికీ ఓపెన్‌గా ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Related Articles

Latest Articles