
2022లో విడుదలైన ‘డీజే టిల్లు’ చిత్రంతో హిట్ కొట్టిన రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ, మరో ఎక్సెంట్రిక్ చిత్రంతో తిరిగి వచ్చారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వారి నాలుగో వెంచర్. రాజీవ్ చిలకా, రాజేష్ జగతియాని, హీరాచంద్ డాండ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాగ్ మయూర్ హీరోగా, మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
దసరా సందర్భంగా టైటిల్ ‘అనుమానపక్షి’ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కామిక్ బుక్ స్టైల్‌లో రంగురంగుల థాట్ బబుల్స్‌తో ఉంది, హాస్యాస్పద ప్రశ్నలతో చిత్రం ఎక్సెంట్రిక్ టోన్‌ను సూచిస్తుంది. మోషన్ పోస్టర్‌లో శ్రీ చరణ్ పాకాల సంగీతం యువతరాన్ని ఆకట్టుకుంటుంది.
ప్రిన్స్ సెసిల్, అనన్నయ, చరిత్, బ్రహ్మాజీ, సుప్రీత్ తదితరులు నటిస్తున్న ఈ ఎంటర్‌టైనర్‌లో సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామా, ఆర్ట్ డైరెక్టర్: జేకే మూర్తి, ఎడిటర్: అభినవ్ కునపరెడ్డి. థియేట్రికల్ రిలీజ్ త్వరలో.


