
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన సినీ కెరీర్‌లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి బ్రాండ్ న్యూ మాస్ పోస్టర్ విడుదలైంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగపూరితమైన కథాంశంతో రూపొందుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు.
చరణ్ 2007లో ‘చిరుత’తో డెబ్యూ చేసినప్పటి నుంచి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విడుదలైన ఈ పోస్టర్‌లో, రైల్వే ట్రాక్‌పై బ్యాక్‌ప్యాక్‌తో, బీడీతో మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు చరణ్. గడ్డం, తీక్షణమైన కళ్లతో రగ్గడ్ స్టైల్‌లో ఆకట్టుకుంటున్నారు. చిత్రంలో చరణ్ బహుముఖ లుక్స్‌తో, తీవ్రమైన శిక్షణతో పాత్రకు న్యాయం చేశారు.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మొదటి సింగిల్ త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. హీరోయిన్‌గా జాన్వీ కపూర్, కీలక పాత్రల్లో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ నటిస్తున్నారు.
సాంకేతిక బృందం: సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు, ఎడిటర్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. ‘పెద్ది’ 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.


