తేజ సజ్జా సంచలనం – పాన్ ఇండియా స్టార్‌గా హవా

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా బాక్సాఫీస్‌లో దూసుకుపోతున్నాడు. ‘హనుమాన్’ సక్సెస్‌తో ఊపందుకున్న తేజ, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిరాయ్’ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్‌తో మొదలైన ‘మిరాయ్’ తొలి రోజు 27.20 కోట్ల గ్రాస్, మూడు రోజుల్లో 81.2 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఓవర్సీస్‌లో 2 మిలియన్ మార్క్‌కు చేరువలో ఉంది.

హిందీ మార్కెట్‌లో ‘మిరాయ్’ మూడు రోజుల్లో 10 కోట్లు రాబట్టి, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తర్వాత ఈ స్థాయి విజయం సాధించిన ఏకైక తెలుగు హీరోగా తేజ సజ్జా నిలిచాడు. ‘హనుమాన్’తో నార్త్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన తేజ, ‘మిరాయ్’తో తన మార్కెట్‌ను మరింత పెంచుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో పాన్ ఇండియా స్టార్‌గా తేజ సజ్జా తన సత్తా చాటుతున్నాడు.

Related Articles

Latest Articles