
తెలుగు సినిమా పరిశ్రమకు 7 జాతీయ అవార్డులు రావడం గర్వకారణమని, అయితే ఇండస్ట్రీ ఈ విజయాన్ని సముచితంగా సత్కరించడంలో వెనుకబడిందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సైమా ప్రెస్ మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. సైమా ఈ విజయాన్ని ముందుగా గుర్తించి సన్మానించిందని ఆయన ప్రశంసించారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ…”ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అన్న ధోరణి కారణంగా మనం ఐక్యంగా మంచి పనులు చేయలేకపోతున్నాం. ఈ విధమైన విభేదాలు మన ఉన్నతిని అడ్డుకుంటున్నాయి” అని విచారం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కటిగా ఉంటే మరిన్ని గొప్ప విజయాలు సాధించవచ్చని ఆయన సూచించారు.
సైమా ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను సత్కరించి, తెలుగు సినిమా ఘనతను మరింత ఉన్నతంగా చాటింది.


