
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన తాజా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’తో గ్రాండ్‌గా తిరిగి వస్తున్నాడు. హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వంలో, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోటుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చారిత్రక యాక్షన్ డ్రామా 1897 నుండి 1922 వరకు సాగే ఒక ధైర్యవంతమైన కథను అందిస్తుంది. మనోజ్ ఈ చిత్రంలో కుల అణచివేత నుండి ఉద్భవించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసే తిరుగుబాటు నాయకుడిగా కనిపించనున్నాడు.
ఈ రోజు మనోజ్ తన తొలి చిత్రం ‘దొంగ దొంగది’ విడుదలైన 21 సంవత్సరాల కానున్న సందర్భంగా ఈ శక్తివంతమైన చిత్రాన్ని ప్రకటించాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌లో ఉన్న ‘డేవిడ్ రెడ్డి’ టైటిల్ పోస్టర్ “బార్న్ ఇన్ ది మద్రాస్ ప్రెసిడెన్సి, రైజ్డ్ఇ న్ ఢిల్లీ, నౌ షేకింగ్ ది బ్రిటిష్ ఎంపైర్ ” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం యొక్క భావోద్వేగ శక్తిని సూచిస్తుంది.
తిరుగుబాటు ప్రారంభమైంది! #DavidReddy


