ఆహా తెలుగు ఇండియన్ సింగర్స్ లో అదరగొడుతున్న ‘ఓజీ’ పాట

సరైన వేదికలు కల్పించి టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఆహా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ నజీర్ మరియు భరత్ రాజ్ త్వరలో రాబోతున్న ఓజీ చిత్రంలోని పాటకు తమ గాత్రాన్ని అందించారు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకలు తమన్ సంగీత సారథ్యం వహించారు. తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జిగా వ్యవహిరిస్తున్న ఆయన సీజన్ 3 వేదికగా నజీర్, భరత్ రాజ్ అవకాశం ఇస్తానని మాటిచ్చారు. అందులో భాగంగానే తాజాగా విడుదలైన ఫైర్ స్ట్రామ్ పాటలో అవకాశం కల్పించారు. మరోవైపు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 కు సంబంధించి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయ్. అందులో భాగంగానే ఆడిషన్స్ జరుపుతున్నారు. ఇప్పటికే యూఎస్ ఆడిషన్స్ పూర్తయ్యాయి. వీటిలో ఎంపికైన గాయకులు గోల్డెన్ టికెట్ పోటీ పడతారు.

Related Articles

Latest Articles