
ప్రముఖ చిత్ర నిర్మాత ఎ.ఎం రత్నం నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రానికి ముందుగా క్రిష్ జాగర్లమూడి దర్శకుడుగా వ్యవహరించినప్పటికీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ తరువాత దర్శకునిగా జ్యోతి కృష్ణ ముందుకు వచ్చారు. అయితే ఈ ప్రాజెక్టు మొదలై సుమారు ఐదు సంవత్సరాలు కావడంతో నిధి అగర్వాల్ అప్పటినుండి ఇప్పటివరకు ఈ సినిమా ప్రాజెక్టుపై ఎంతో నమ్మకంతో ఉన్నారని ఆమెను పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ లో కొనియాడటం జరిగింది. సాధారణంగా ఒక సినిమా కోసం హీరోయిన్ ఐదు సంవత్సరాలు వేచి ఉన్నటువంటి మామూలు విషయం కాదు. అటువంటిది నిధి అగర్వాల్ ఈ సినిమా కోసం అలా వేచి ఉన్నారు. అంతేకాక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అంతా తన బాధ్యతగా తీసుకుంటూ ముందుండి మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వెళ్లారు. తన భవిష్యత్తు గురించి ఆలోచించుకుని వేరే సినిమాలతో ముందుకు వెళ్లిపోకుండా ఈ సినిమా గురించి ఎంతగానో ఆలోచించి తన సమయాన్ని ఈ సినిమా కోసం చిత్ర బృందం కోసం కేటాయించిన నిధి అగర్వాల్ ను చూసి నేను ఆడపిల్ల ఇంత బలంగా సినిమాను ముందుకు తీసుకు వెళుతుంది అని అనిపించింది. కొన్ని సందర్భాలలో మనం ఎలా సినిమా కోసం నిలబడలేకపోయామే అని ఆమెను చూసి సిగ్గుపడ్డాను. అయినప్పటికీ సినిమాను నేను వదిలేయకుండా చివరి వరకు నాదైన ప్రయత్నం నేను చేస్తాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.


