ప్రముఖ కోలీవుడ్ దర్శక నటుడు వేలు ప్రభాకరన్ కన్నుమూత

కోలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు మరియు నటుడు వేలు ప్రభాకరన్ (68) అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చివరకు కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు రేపు జరగనున్నాయి.

వేలు ప్రభాకరన్ దర్శకుడిగా పదుల సంఖ్యలో సినిమాలను తెరకెక్కించారు. ఆయన సినిమాలు ఎక్కువగా నాస్తిక, విప్లవాత్మక అంశాల చుట్టూ నడిచేవి, సమాజంలో ఆలోచనలను రేకెత్తించేలా ఉండేవి. కెరీర్ చివరి దశలో నటుడిగా మారి, పలు హిట్ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన మరణం కోలీవుడ్ పరిశ్రమకు తీరని లోటు.

Related Articles

Latest Articles