రాజ్యసభ ప్రయాణంలో రజినీ ఆశీస్సులు తీసుకున్న కమల్ హాసన్

నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్, రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భంగా తన చిరకాల స్నేహితుడు, సూపర్ స్టార్ రజినీకాంత్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన కొత్త రాజకీయ ప్రయాణం గురించి స్నేహితుడితో పంచుకున్నట్లు కమల్ తెలిపారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోలను కమల్ తన X వేదికపై పోస్ట్ చేశారు, ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కమల్‌ను రజినీ అభినందించి, ఈ కొత్త ప్రయాణంలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు.

https://x.com/ikamalhaasan/status/1945365172648075500

Related Articles

Latest Articles