హీరో రవితేజ తండ్రి కన్నుమూత

టాలీవుడ్ హీరో రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు(90) కన్నుమూశారు. హైదరాబాద్లోని రవితేజ నివాసంలో నిన్న రాత్రి మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వీరి స్వగ్రామం ఏపీలోని జగ్గంపేట. రాజగోపాల్ రాజు ఫార్మసిస్ట్ గా పనిచేశారు. ఆయనకు రవితేజ, రఘు, భరత్ రాజు కుమారులు. కాగా భరత్ 2017లో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles