
తమిళ సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్‌లో రాజు హై రిస్క్ స్టంట్ చేస్తుండగా, కారు బోల్తా పడి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాజు మృతిపై హీరో విశాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.


