
ఒకరికి ఒకరు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు శ్రీరామ్ ఇటీవలే తమిళనాడులో అరెస్టు కావడం జరిగింది. ఓ రాజకీయ నాయకుని దగ్గర మాదకద్రవ్యాలు కొనుగోలు చేశాడని పక్క ఇన్ఫర్మేషన్ తో శ్రీరామ్ కు వైద్య పరీక్షలు చేయగా అతని రక్త నమోనాలలో డ్రగ్స్ ఉన్నట్లు తెలిసింది. అయితే దీనిపై చెన్నైకి సంబంధించిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వారు శ్రీరామ్ ను అరెస్టు చేసి సుమారు రెండు గంటల పాటు అతడిని విచారణ చేశారు. ఇటీవలే హరికథ చిత్రంతో ఆయన ప్రేక్షకులను అలరించారు. అంతేకాక విజయ్ దళపతి తో కలిసి స్నేహితుడు చిత్రంలో జీవాతో పాటుగా స్నేహితుడిలా నటించారు.