ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్ లో ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ గా అవార్డ్ అందుకున్న హీరోయిన్ మాళవిక మోహనన్

బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ మరో ఘనత దక్కించుకుంది. ఆమె ముంబైలో జరిగిన ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్ లో పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా అవార్డ్ దక్కించుకుంది. ఓటీటీ, వెబ్ ఎంటర్ టైన్ మెంట్ కు సంబంధించిన బిగ్గెస్ట్ అవార్డ్స్ గా ఈ సంస్థకు పేరుంది. ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్ ఈవెంట్ లో రెడ్ కార్పెట్ పై నడిచిన మాళవిక మోహనన్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన రాజా సాబ్ టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గర కానుంది మాళవిక.

Related Articles

Latest Articles