
టాలీవుడ్ హీరోయిన్ మన్నారా చోప్రా ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె తండ్రి రామన్ రాయ్ (72) అనారోగ్యంతో నిన్న ముంబైలోని తమ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ హృదయవిదారక విషయాన్ని మన్నారా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తమ కుటుంబానికి తండ్రి రామన్ రాయ్ మూలస్తంభంగా నిలిచారని, ఆయన మరణం తమను తీవ్రంగా కలిచివేసిందని ఆమె భావోద్వేగంతో రాసుకొచ్చారు.
రామన్ రాయ్ అంత్యక్రియలు రేపు (జూన్ 18, 2025) మధ్యాహ్నం 1 గంటలకు ముంబైలోని అంబోలి స్మశానవాటికలో నిర్వహించనున్నారు. మన్నారా చోప్రా తెలుగు చిత్ర పరిశ్రమలో ‘జక్కన్న’, ‘రోగ్’, ‘తిక్క’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ దుఃఖ సమయంలో ఆమె కుటుంబానికి సినీ పరిశ్రమ నుండి, అభిమానుల నుండి సంతాప సందేశాలు అందుతున్నాయి.