ఘనంగా ప్రభాస్ “రాజా సాబ్” టీజర్ లాంఛ్

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్”. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. “రాజా సాబ్” సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర టీజర్ లాంఛ్ ఈవెంట్ ను అభిమానులు, మూవీ లవర్స్ కేరింతల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ మాట్లాడుతూ – “రాజా సాబ్” సినిమా కోసం మూడున్నరేళ్లుగా పనిచేస్తున్నాం. ఇదొక వండర్ ఫుల్ ఎక్సిపీరియన్స్. ఇప్పటికీ ఈ మూవీ కోసం డిజైన్స్ చేస్తున్నాం. మీరు రాజా సాబ్ హవేలీని, సినిమాకు చేసిన ఇతర ఆర్ట్ వర్క్ ను ఇష్టపడతారు. అన్నారు

సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళని మాట్లాడుతూ – ఇలాంటి పెద్ద వేదిక మీద మాట్లాడటం నాకు ఇదే ఫస్ట్ టైమ్. “రాజా సాబ్” సినిమాకు ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. ప్రభాస్ గారితో నేను చేస్తున్న రెండో చిత్రమిది. ఆయన గురించి మీ అందరికీ తెలుసు. “రాజా సాబ్” సినిమాకు పనిచేయడం గొప్ప అనుభూతిని కలిగించింది. అన్నారు.

క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – ఈ రోజు “రాజా సాబ్” ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృతి గారి బర్త్ డే. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. “రాజా సాబ్” సినిమా టీజర్ చూశాక నిర్మాత విశ్వప్రసాద్ గారి విజన్ ఏంటో మీ అందరికీ తెలిసి ఉంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరు ఎప్పటికీ గుర్తుండేలా “రాజా సాబ్” సినిమా ఉంటుంది. దర్శకుడు మారుతి ప్రతిభ ఒక స్నేహితుడిగా నాకు తెలుసు. మారుతి వాళ్ల నాన్నగారు మచిలీపట్నం సిరి కాంప్లెక్స్ థియేటర్ దగ్గర అరటిపళ్లు అమ్మేవారు. అప్పుడే మారుతి ఒక కలగన్నాడు. ఏదో ఒకరోజు తన బ్యానర్ కూడా ఆ థియేటర్ దగ్గర పెడతారని నమ్మాడు. ఇండస్ట్రీలో 21 ఏళ్ల తన కష్టం తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ గారితో “రాజా సాబ్” అనే పాన్ ఇండియా మూవీ చేస్తూ ఈరోజు ఆ థియేటర్ దగ్గర తన కటౌట్ పెట్టేలా చేశాడు. మన ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ ఒకరు ఈ సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడారు. రేపు అతనే మన సినిమాను పొగుడుతాడు అనే నమ్మకం నాకు ఉంది. ప్రభాస్ గారు నమ్మి మూవీ చేస్తున్నారు. ఆయనకు నా బెస్ట్ ఇస్తానని మారుతి నాతో చెబుతుంటాడు. ఇది మూవీ లాంఛ్ కాదు, ట్రైలర్ లాంఛ్ కాదు జస్ట్ టీజర్ లాంఛ్. ఇక్కడే ఇంత రెస్పాన్స్ చూస్తున్నాం. రేపు డిసెంబర్ 5న “రాజా సాబ్” బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర సృష్టిస్తుంది. “రాజా సాబ్”కు తమన్ మ్యూజిక్, కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ , రాజీవన్ గారి సెట్స్ అన్నీ హైలైట్ అవుతాయి. ఈ కార్యక్రమానికి తెలుగు పాత్రికేయులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి జర్నలిస్ట్ కు థ్యాంక్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – “రాజా సాబ్” సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. “రాజా సాబ్” మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్. ఈ సినిమా కోసం మరే సినిమాకు నిర్మించని బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. వీఎఫ్ఎక్స్, మేకింగ్ గ్రాండియర్ లో థర్డ్ బిగ్గెస్ట్ మూవీ అని చెప్పగలను. “రాజా సాబ్” మొదలుపెట్టినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మీ అంచనాలు అన్నీ అందుకుంటూ మా సినిమా అన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ప్రభాస్ గారు వరల్డ్ సినిమాకు బిగ్గెస్ట్ ఐకాన్. ఆయనతో కలిసి మూవీ చేయడం ఎంతో హ్యాపీగా ఉంది. ప్రభాస్ గారితో ఈ మూవీ గురించి డిస్కస్ చేసినప్పుడు కొన్ని నిమిషాల్లోనే ఓకే చేశారు. మారుతి గారు బెస్ట్ డైరెక్టర్. “రాజా సాబ్” సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటుంది. 2024లో మా సంస్థ నుంచి వచ్చిన కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. ఆ లోటును “రాజా సాబ్” సినిమా భర్తీ చేస్తూ అతి పెద్ద విజయాన్ని సాధించబోతోంది. ఈ సినిమా కోసం మారుతి గారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 120 డేస్ కష్టపడ్డారు. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ రాజా సాబ్ మూవీకి హైలైట్ అవుతుంది. ప్రభాస్ గారి లాంటి పెద్ద హీరోకు మ్యాచ్ అయ్యేలా నెగిటివ్ రోల్ కు సంజయ్ దత్ గారిని తీసుకున్నాం. రాజా సాబ్ మూవీకి సీక్వెల్ పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుంది. అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – “రాజా సాబ్” టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మీడియా మిత్రులు మా ఆతిథ్యం తీసుకుని వెళ్లాలని కోరుతున్నా. తెలుగు మీడియా ఫ్రెండ్స్ ఎప్పుడూ నా వెంటే ఉన్నారు. నన్ను మంచి సినిమాలు చేయమని ప్రోత్సహించారు. “రాజా సాబ్” సినిమా ఎలా స్టార్ట్ అయ్యిందో చెబుతాను. ఒకరోజు యూవీ వంశీ పిలిచి ప్రభాస్ తో మూవీ చేస్తావా అన్నాడు. అంతకంటే ఇంకేం కావాలి అని చెప్పాను. ముంబై వెళ్లి ప్రభాస్ ను కలువు అని పంపించాడు. ప్రభాస్ గారిని కలవడం అంటే దేవుడిని కలిసినట్లు భావించా. అలాంటి ప్రభాస్ గారు నన్ను ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకుని మాట్లాడారు. తనను డార్లింగ్ అని పిలువు అన్నారు. మీ ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్ మూవీస్ ఇష్టం. అలాంటి సినిమా చేద్దామని ప్రభాస్ గారు నాతో చెప్పారు. నేను ఒక లైన్ గా కథ చెప్పా. ఆ తర్వాత నేను గోపీచంద్ తో చేసిన పక్కా కమర్షియల్ మూవీ అంతగా ఆదరణ పొందలేదు. ఆ టైమ్ లో నేను ప్రభాస్ గారితో మూవీ చేయడం కరెక్టేనా, ఆయన భారీ పాన్ ఇండియా లైనప్ లో ఉన్నారు అని సందేహిస్తూ ఆ విషయాన్ని యూవీ వంశీకి చెప్పాను. ఆయన సరే ఆలోచించు అన్నారు. మనం తర్వాత సినిమా చేద్దామని ప్రభాస్ గారికి చెప్పాలని ఫిక్స్ అయ్యా. ఇంతలో ఆయనే ఫోన్ చేసి మీరు చెప్పిన స్టోరీలో ఈ పాయింట్స్ చాలా బాగున్నాయి అంటూ చెప్పడం ప్రారంభించారు. ఈయనకు ఇంత బాగా కథ ఎగ్జైట్ చేసినప్పుడు మనం వెనకడుగు వేయడం ఎందుకు అనిపించింది. “రాజా సాబ్” ను ఒక ఛాలెంజ్ గా తీసుకుని సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. పక్కా కమర్షియల్ రిజల్ట్ తర్వాత మా కాంబోలో మూవీ అనుకున్న ప్రొడ్యూసర్ ఇది వర్కవుట్ కాదేమో అని డ్రాప్ అయ్యారు. కానీ అలాంటి టైమ్ లో నాకు సపోర్ట్ గా నిలిచిన ఒకే ఒక పర్సన్ డార్లింగ్ ప్రభాస్ గారు. “రాజా సాబ్” అనౌన్స్ చేశాక మీ ఫ్యాన్స్ తో పాటు అందరికీ చాలా సందేహాలు ఉండేవి. ప్రభాస్ కు ఒక ఇమేజ్ ఉంది. ఆయన కామెడీ ఎలా చేస్తాడు అని డౌట్స్ ఎక్స్ ప్రెస్ చేశారు. మా ఇంట్లో వాళ్లు కూడా ఏంటీ నువ్వు ప్రభాస్ తో సినిమా చేస్తున్నావా అనేవారు. ఎందుకు ఈ కథ రాయలేను అని గట్టిగా నిర్ణయించుకుని చేసిన స్క్రిప్ట్ ఇది. మారుతితో సినిమా అవసరమా ఈ టైమ్ లో అని ఎంతోమంది అన్నా ప్రభాస్ గారు గట్టిగా నిలబడ్డారు. నేను ఈ మూవీ బాగా చేయగలను అని నమ్మారు. నిన్న రాత్రి కూడా అరగంట టీజర్ గురించి మాట్లాడారు. హను రాఘవపూడికి టీజర్ చూపించా చాలా బాగుందని అన్నారు అంటూ హ్యాపీగా చెప్పారు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాజా సాబ్ గురించి చేసే పోస్ట్ లు ప్రభాస్ గారికి పంపిస్తుంటా. అభిమానులపై గుండెల నిండా ప్రేమ నింపుకున్నారు ప్రభాస్ గారు. మీరు ఆయనను ఎంత ప్రేమిస్తున్నారో అంతకంటే వెయ్యి రెట్లు మిమ్మల్ని ప్రభాస్ గారు ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని ఆయన నేరుగా కలవకపోవచ్చు కానీ మీకు బెస్ట్ మూవీస్ ఇచ్చేందుకు రాత్రీ పగలు ఎంత తపన పడతారో కష్టపడతారో నేను కళ్లారా చూశాను. సినిమాకు సంబంధించి ప్రతిదీ ఎలా వస్తుందో అడిగి తెలుసుకుంటారు. మన ఫ్యాన్స్ వండర్ ఫుల్ ఫ్యాన్స్ డార్లింగ్ వాళ్లకు మంచి మూవీ ఇవ్వాలని ప్రభాస్ గారు అంటుంటారు. ఈ సినిమా కోసం ప్రభాస్ గారికి ముగ్గురు హీరోయిన్స్ ను పెట్టాం. గతంలో ఆయన చేసిన కల్కి, సలార్, ఆదిపురుష్ లో హీరోయిన్స్ తో ఇంటరాక్షన్ తక్కువ. ఈసారి వింటేజ్ ప్రభాస్ గారిని, బుజ్జిగాడి స్టైల్ లో పాన్ ఇండియా మూవీకి ప్రెజెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. టీజర్ మిమ్మల్ని ఇంతలా ఆకట్టుకుంది. రేపు ట్రైలర్, మూవీ ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు. మీరు ప్రభాస్ గారిని ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించబోతున్నాం. ప్రభాస్ గారిలో ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ ఉంటుంది. టైమింగ్ ను ఈ మూవీలో ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్ గారికి ముగ్గురు హీరోయిన్స్ తో ఒక కలర్ ఫుల్ సాంగ్ ఉంటుంది, అలాగే ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది. ఆయన డ్యాన్సులను కూడా మీరంతా ఎంజాయ్ చేయబోతున్నారు. ప్రేక్షకులు ఫ్యామిలీ అంతా కలిసి రాజా సాబ్ చిత్రాన్ని ఆస్వాదిస్తారు. ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చిందంటే ప్రభాస్ గారి తర్వాత విశ్వప్రసాద్ గారు కారణం. ఆయన ఈ మూవీని నమ్మి గ్రేట్ ప్రాడక్ట్ తీసుకొద్దాం అంటూ ఖర్చుకు వెనకాడకుండా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కొంత షూటింగ్, సాంగ్స్ బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఇలాగే హై క్వాలిటీతో కంప్లీట్ చేసి సినిమాను మీ ముందుకు డిసెంబర్ 5న తీసుకొస్తాం. అన్నారు.

నటీనటులు – ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని
మ్యూజిక్ – తమన్
ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కేఎన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – టీజీ కృతి ప్రసాద్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్), వంశీ కాకా
కో ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం – మారుతి

Related Articles

Latest Articles