2020వ సంవత్సరంలో కరోనా ప్రభావంతో లాక్డౌన్ వల్ల థియేటర్లు మూతపడటం, షూటింగ్‌లు ఆగిపోవడంతో టాలీవుడ్ తీవ్ర నష్టాల పాలైంది. దీంతో ఈ ఏడాది టాలీవుడ్‌కి బ్యాడ్ ఇయర్ అయినా.. జనవరి, ఫిబ్రవరి నెలలో థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. మార్చి చివరి వారం నుంచి లాక్డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో.. చాలా సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. ఇలా ఓటీటీలో విడుదలైన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
కొత్త సంవత్సరం వస్తున్న క్రమంలో… ఈ ఏడాది సూపర్ హిట్ అయిన తెలుగు సినిమాల గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు భారీ విజయం సాధించి రికార్డులు బద్ధలు కొట్టాయి. కలెక్షన్ల పరంగా నాన్ బాహుబలి రికార్డులను మహేష్, అల్లు అర్జున్ బద్ధలు కొట్టారు. మహేష్, అల్లు అర్జున్ సినిమా కెరియర్లోనే అత్యధిక కలెక్షన్లు సంపాదించుకున్న సినిమాగా ఇవి నిలిచాయి.
ఇక ఫిబ్రవరిలో విడుదలైన విశ్వక్ సేన హీరోగా వచ్చిన హిట్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. థ్రిల్లర్ ఎంటర్‌ట్రైనర్‌గా ఈ సినిమా రాగా.. ఇందులో బ్రహ్మాజీ, మురళీ శర్మ, హరితేజ కీలక పాత్రలలో నటించారు. నేచురల్ స్టార్ నాని దీనిని నిర్మించారు. ఇక నితిన్- రష్మిక కాంబోలో వెంకీ కుడుముల తెరకెక్కించిన ‘భీష్మ’ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత ఓటీటీలో విడుదల అయిన సినిమాల్లో కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.