రాంచరణ్ భార్య ఉపాసనకు కరోనా?

మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రాంచరణ్, వరుణ్ తేజ్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. మెగా ఫ్యామిలీ అంతా కరోనా టెస్టులు చేయించుకుంటోంది. ఇటీవల క్రిస్మస్ సందర్భంగా రాంచరణ్ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్‌కు మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది. అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, నిహారికతో పాటు మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది. ఆ సెలబ్రేషన్స్‌లో చరణ్, వరుణ్ తేజ్ కూడా ఉన్నారు.

upasana corona

దీంతో వారిద్దరి నుంచి మిగతావారికి సోకే ప్రమాదం ఉండటంతో.. ఇంకా మెగా ఫ్యామిలీలో ఎవరెవరికి సోకిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో రాంచరణ్ భార్య ఉపాసస పెట్టిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. చరణ్‌కు ఎలాంటి లక్షణాలు లేవని, స్ట్రాంగ్‌గా ఉన్నాడని తెలిపింది. తాను కూడా కరోనా టెస్టు చేయించుకున్నానని, నెగిటివ్‌గా నిర్ధారణ అయిందని చెప్పింది.

అయితే తనకు మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఉపాసన చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నానని, వేడి నీరు, ఆవిరి పట్టడం లాంటివి చేస్తున్నానని ఉపాసన తెలిపింది. తనకు కూడా కరోనా సోకే అవకాశముందంటూ ఉపసాన ట్వీట్ చేయడం గమనార్హం. ఒకవేళ ఉపాసనకు కూడా కరోనా సోకిందేమోనని, అందుకే ముందుగా చెబుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.