కన్నడ సూపర్ స్టార్ హీరో యశ్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న కేజీఎఫ్-2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన సినిమా టీజర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగియగా.. త్వరలోనే రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా దీనిని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజాగా ఒక వార్త ట్రెండింగ్‌గా మారింది. ఈ సినిమా క్రైమాక్స్ చిత్రీకరణకు భారీ బడ్జెట్ అయిందట. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యశ్ మధ్య వచ్చే క్లైమాక్స్ సీన్లు తెరకెక్కించడానికి భారీ మొత్తంలో ఖర్చు పెట్టినట్లు తెలుసతోంది. ఈ క్లైమాక్స్ సీన్ల కోసం రూ.12 కోట్లు ఖర్చు చేశారట. ఇక సినిమా మొత్తానికి రూ.100 కోట్లకుపైగా బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది.