హీరోగా మారనున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్

కొరియోగ్రాఫర్లు హీరోగా మారి సినిమాలు చేయడం కొత్తేమి కాదు. ప్రభుదేవా, రాఘవ లారెన్స్ వంటి కొరియోగ్రాఫర్లు హీరోలుగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఇటీవలే జానీ మాస్టర్ హీరోగా తెలుగులో ఒక సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ హీరోగా మారుతున్నాడు. అతడెవరో కాదు.. యశ్ మాస్టర్.

yash master become hero

ఈటీవీలో ప్రసారమయ్యే ఢీషోలో కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన యశ్ మాస్టర్.. ప్రస్తుతం స్టార్ మాలో వస్తున్న డ్యాన్స్ + షోలో జడ్జిగా పనిచేస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా యశ్ పనిచేశాడు. కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న యశ్ మాస్టర్‌ను హీరోగా లాంచ్ చేయడానికి దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడట.

దిల్ రాజుకి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుందట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.