ప్రెస్ క్లబ్ లో గణతంత్ర వేడుకులు

సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో 71 వ  గణతంత్ర దినోత్సవ వేడుకలు  ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ పాలకమండలి  అధ్యక్షులు యస్.విజయ్ కుమార్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి  రాజమౌళి చారి జాతీయ జెండా ఎగరవేశారు. ప్రెస్ క్లబ్  ఉపాధ్యక్షులు వేణుగోపాల నాయుడు,రెహానా బేగం,  కోశాధికారి సూరజ్ కుమార్, సంయుక్త కార్యదర్శులు చిలుకూరి హరిప్రసాద్, కంబాల పల్లి కృష్ణ, సభ్యులు అనిల్ కుమార్, వసంత కుమార్ , నంద్యాల భూపాల్ రెడ్డి,  కట్ట కవిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్యాగధనుల పునాదిలపై నిర్మితమైన భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత  ప్రతి ఒక్కరిపై ఉందని ప్రెస్ క్లబ్ సభ్యులు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి దాత అంబేద్కర్ చేసిన సేవలు గుర్తించాలని పాలకమండలి సభ్యులు అన్నారు. ప్రెస్ క్లబ్ స్థాపించి 5 దశాబ్దాలు పూర్తయిన సందర్బంగా ఈ వేడుక జరగడం అభినందనియమని ప్రెస్ క్లబ్ పాలకమండలి ప్రశంసించింది.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యులు పాల్గొన్నారు.