డిజిటల్ ఆడియన్స్ ని మెప్పించడానికి రెడీ…

యంగ్ హీరో నితిన్, క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ లో వచ్చిన మూవీ చెక్. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని భవ్య క్రియేషన్స్ నిర్మించింది. చెస్ గేమ్, జైలు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో పర్వాలేదు అనిపించింది. ఏలేటి మార్క్ మూవీగా చెక్ మంచి పేరు తెచ్చుకుంది.

చంద్ర శేఖర్ ఏలేటి సినిమాల కోసం ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడూ వెయిట్ చేస్తూ ఉంటారు. థియేటర్ రన్ కంప్లీట్ చేసుకున్న చెక్ మూవీ మే 14 నుండి సన్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నీ అనౌన్స్ చేస్తూ అఫీషియల్ పోస్టర్ కూడా బయటకి వచ్చేసింది. సో మరో 48 గంటల్లో సన్ నెక్స్ట్ యాప్ లో చంద్ర శేఖర్ ఏలేటి మార్క్ మూవీని చూసేయండి