కార్తికేయ వాల్ పేపర్ పై ‘మెగాస్టార్’

యంగ్ హీరో కార్తికేయ తన పుట్టిన రోజు సందర్భంగా రెండు సినిమాల అప్డేట్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేశాడు. ఇటీవలే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన కార్తికేయ బ్లాక్ టీ షర్ట్ లో ఫుల్ ఫిట్ గా ఉన్నాడు. కార్తికేయ ఎయిర్పోర్ట్ పిక్స్ బయటకి వచ్చి ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి దానికి కారణం కార్తికేయ చేతిలో ఉన్న ఫోన్ అవ్వడం విశేషం. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే కార్తికేయ ఫోన్ వాల్ పేపర్ అవ్వడం విశేషం.

పై ఫోటోని మీరు గమనిస్తే, అందులో కార్తికేయ ఫోన్ కి మెగాస్టార్ చిరంజీవి ఉన్న వాల్ పేపర్ కనిపిస్తుంది. ఒక హీరో ఇంకో హీరో గురించి మాట్లాడడమే గొప్ప అయితే కార్తికేయకి చిరుపై ఎంత అభిమానం ఉంటే పర్సనల్ ఫోన్ కి వాల్ పేపర్ గా పెట్టుకోని ఉంటాడు. ఆ పిక్ చిరూ కార్తికేయ కూడా ఉన్నాడు, అసలు ఈ పిక్ ఎక్కడిది? ఎప్పటిది? అని సెర్చ్ చేస్తే మాకు ఈ సమాధానం దొరికింది.

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా కార్తికేయ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ ఫోటోని పోస్ట్ చేశాడు. చిరు తనపై చెయ్యి వేయడం ఎంతో స్పెషల్ గా ఫీల్ అయిన కార్తికేయ, దాన్ని తన ఫ్యాన్ మొమెంట్ గా దాచుకోని… ఆ ఫోటోనే వాల్ పేపర్ గా పెట్టుకున్నాడు. ఒక ఫ్యాన్ ని తన అభిమాన హీరోతో ఫోటో దిగడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది. మే బి ఈ సంఘటన కార్తికేయ తన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు. నిజానికి కార్తికేయ చిరంజీవిపై తన అభిమానం చూపించడం ఇదే మొదటిసారి కాదు, గతంలో ఒక టీవీషోలో జరిగే అవార్డు ఫంక్షన్ లో కూడా కార్తికేయ చిరు మెడ్లికి పెర్ఫార్మ్ చేసి అందరిని మెప్పించాడు. ఈ ఈవెంట్ కి ఛీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి, కార్తికేయ పెర్ఫార్మెన్స్ చూసి అతనికి హగ్ ఇచ్చాడు. దీంతో ఎమోషనల్ అయిన యంగ్ హీరో, తన లైఫ్ లో ఇది బెస్ట్ మొమెంట్ అని చెప్పాడు.