రామ్ చరణ్, చిరంజీవి సినిమాలు తీసిన ప్లేస్ లో కార్తికేయ షూటింగ్

ఆర్.ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `90 ఎం.ఎల్‌`. శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. నేహా సోలంకి హీరోయిన్‌గా న‌టిస్తుంది. `ఆర్‌.ఎక్స్ 100` సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్త‌య్యింది. పాట‌ల‌ను చిత్రీక‌రించ‌డానికి ఎంటైర్ యూనిట్ అజ‌ర్ బైజాన్ బ‌య‌లుదేరింది. ఈ సంద‌ర్భంగా…

karthikeya 90ml

నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ “టీజ‌ర్‌ని బ‌ట్టే సినిమా ఎలా ఉంటుందో జనాలకి అర్థ‌మైపోతుంది, ఇప్పుడు ఈ పాట కూడా అందుకు తగ్గట్టుగానే అబ్బాయిలకి క‌నెక్ట్ అయ్యే విధంగా ఉండడంతో సినిమా కాన్సెప్ట్ మీద మాకున్న నమ్మకం మరింత బలపడింది. ప్రస్తుతం సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. రెండు పాటల చిత్రీకరణ కోసం అజర్ బేజాన్ రాజధాని బాకు వెళ్తున్నాం.అనేక బాలీవుడ్ చిత్రాలు అక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఇటీవల మన భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు కూడా అక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి ” అని తెలిపారు . ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ, రీసెంట్ గా వచ్చిన మెగాస్టార్ సైరా సినిమాలోని మెయిన్ సీన్స్ తెరకెక్కించింది ఈ అజర్ బైజాన్ లోనే కావడం విశేషం.