పాట బాగుంది, ఈసారి రాజ్ తరుణ్ హిట్ కొట్టినట్లే

యంగ్ హీరో రాజ్ తరుణ్, అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇద్దరి లోకం ఒకటే. ప్రేమ కథకి కావాల్సిన క్లాసీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నుంచి యు ఆర్ మై హార్ట్ బీట్ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఎప్పుడూ సౌల్ ఫుల్ సాంగ్స్ ఇచ్చే మిక్కీ జే మేయర్ మరోసారి తన ట్యూన్ తో మ్యాజిక్ చేశాడు. అనురాగ్ కులకర్ణి తన వాయిస్ తో సాంగ్ కి ప్రాణం పోశాడు. లిరికల్ సాంగ్ లో వచ్చిన విజువల్స్ లో రాజ్ తరుణ్ కొత్తగా ఉన్నాడు. షాలిని, రాజ్ తరుణ్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్లే ఉంది. కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండడం విశేషం. దిల్ రాజు బ్యానర్ అంటేనే పర్ఫెక్ట్ యూత్ అండ్ ఫ్యామిలీ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇద్దరి లోకం ఒకటే సినిమా కూడా ఆ స్థాయిలోనే ఉంది. మరి రాజ్ తరుణ్ కి అవసరమైన హిట్ ఇద్దరి లోకం ఒకటే ఇస్తుందేమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి. అప్పటివరకూ ఈ సాంగ్ విని ఎంజాయ్ చేయండి.