బాహుబలి సినిమాతో రమ్యకృష్ణ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. లేడీ అమితాబ్ విజయశాంతి ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరూ మూవీతో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఈ ఇద్దరి దారిలోనే నడుస్తూ రోజా కూడా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యింది. 2013లో లాస్ట్ సినిమా చేసిన రోజా, ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయ్యి తెరపై కనిపించలేదు. టీడీపీ, వైసీపీ పార్టీల్లో యాక్టివ్ మెంబర్ పని చేసిన ఫైర్ బ్రాండ్ రోజా, 2019లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి ఒక కీలకమైన నామినేటెడ్ పదవిలో ఉంది. అయితే ప్రస్తుతానికి పాలిటిక్స్ అండ్ జబర్దస్త్ షోలతో బిజీగా ఉన్న రోజా, మళ్ళీ సినిమాల్లో నటించనున్నారట… అది కూడా నందమూరి బాలకృష్ణ సినిమాలో కావడం విశేషం.
ప్రస్తుతం రూలర్ సినిమాలో నటిస్తున్న బాలయ్య, అది అయ్యాక బోయపాటి శ్రీనుతో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబందించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ మూవీలో బాలకృష్ణ లెజెండ్ మించే పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇందులోనే రోజా పవుర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. హీరో పాత్రకి గట్టి పోటీ ఇచ్చే రోల్ కి రోజా అయితేనే న్యాయం చేస్తుందనే నమ్మకంతో బోయపాటి ఆమెని సంప్రదించినట్టు తెలుస్తోంది. బలమైన పాత్ర కావడంతో రోజా కూడా ఓకే చెప్పిందని సమాచారం. దాదాపు ఏడెనిమిది సినిమాల్లో కలిసి నటించి మంచి హిట్ మూవీస్ ఇచ్చిన ఈ కాంబినేషన్, ఇన్నేళ్ల తర్వాత హీరో విలన్ గా కనిపించడం నిజంగానే స్పెషల్ న్యూస్.