ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొన్ని సినిమాలు రాజకీయ పార్టీలకు సంబంధించి వస్తున్నాయి. ఆలా వచ్చిన సినిమాలలో ఓ సినిమా యాత్ర 2. సమైక్యాంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా వైస్ రాజా శేఖర్ రెడ్డి చేసిన విష్యం తెలిసిందే. అయితే ఆయన పాద యాత్రను చూపిస్తూ 2019 ఎన్నికల సమయంలో యాత్ర సినిమా రావడం జరిగింది. మహి వి రాఘవ తీసిన ఆ సినిమా వైసీపీ ఓటర్లను బాగానే ఆకట్టుకుంది.
అయితే అదే నేపథ్యంలో ఇప్పుడు 2024 ఎన్నికలను దర్శకులు మహి వి రాఘవ యాత్ర 2 సినిమా తెరకెక్కించారు. వైస్ రాజా శేఖర్ రెడ్డి మరణాంతరం వైస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పాద యాత్రను చూపిస్తూ తీసిన ఈ సినిమా ఇటీవలే విడుదల కావడం జరిగింది. ఇక విషయానికి వస్తే ఈ సినిమా ఎంత వరుకు విజయం సాధించింది అని చెప్పాలో అర్ధం కాకుండా ఉంది. వైసీపీ సంబందించిన వాళ్ళు, ఇంకా కొంత మంది ప్రేక్షకులు సినిమా బావుంది అని చెప్పినప్పటికీ, కొన్ని కలిపితే సన్నివేశాలు ఉన్నాయ్ అని మరి కొంత మంది ప్రేక్షకులు అంటున్నారు. ఇంకొందరు అయితే మొత్తం సినిమానే కలితం అంటున్నారు. కేవలం ఎన్నికల కోసం జగన్ తన పై ప్రజలకు సానుభూతి కలగడం కోసం మహి వి రాఘవ ఈ సినిమా తీసారని అంటున్నారు.
ఈ సినిమా ప్రజలు అందరూ చూడాలని వైసీపీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అనే విషయం బాగానే తెలుస్తుంది. అమెరికాలోని NRI ఏకంగా యాత్ర 2 సినిమా ప్రజలకు ఉచితంగా చూపించడం కోసం దగ్గరలో ఉన్న తియేటర్లలో ప్రజలకు టిక్కెట్లు తీసుకుని పంపిస్తున్నారు అనే వార్త బాగా వినిపిస్తుంది. వైస్ జగన్ మోహన్ రెడ్డి కోసం మహి వి రాఘవ ఇంత కష్ట పడుతున్నారు అని, అయినా జగన్ రెడ్డి కి ఈసారి ఎన్నికల్లో ఉపయోగ పడేలా వచ్చిన ఈ యాత్ర 2 సినిమా ఉపయోగపడేలా లేదు అని అనుకుంటున్నారు.
Home సినిమా వార్తలు జగన్ కోసం ‘యాత్ర 2’ దర్శకుడు పడుతున్న కష్టం వృధానా??? ‘యాత్ర 2’ టిక్కెట్లు ఫ్రీ?