రెండోసారి తండ్రి అయిన కేజీఎఫ్ స్టార్ యాష్

yash-radhika-pandit-blessed-with-baby-boy

కే జి ఎఫ్ సినిమాతో తెలుగులో మంచి పేరు సంపాదించుకున్న కన్నడ స్టార్ హీరో యష్ తన అభిమానులతో ఒక మంచి శుభవార్త షేర్ చేసుకున్నాడు.ఈ రోజు బెంగుళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తన సతీమణి, రాధిక పండిట్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి మరియు బిడ్డ ఇద్దరూ మంచి ఆరోగ్య స్థితిలో ఉన్నారు, పలు చిత్రాల్లో కలిసి నటించిన యశ్-రాధికా 2016లో వివాహం చేసుకున్నారు గతేడాది డిసెంబర్లోనే యాష్, రాధికలకు కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే.

జూనియర్ యష్ పుట్టిన సంగతి తెలుసుకున్న అభిమానులు యాష్, రాధికలకు సోషల్ మీడియా మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే యష్ ప్రస్తుతం ‘కేజీఎఫ్’ సీక్వెల్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం విడుదలకు సిద్ధం అవుతుంది.