‘కేజీఎఫ్-2’ యశ్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

కేజీఎఫ్-2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కేజీఎఫ్2 టీజర్ యూట్యూబ్ రికార్డులను షేక్ చేసింది. సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన సినిమా టీజర్‌గా రికార్డులు సృష్టించింది. దీంతో సినిమాపై అంచాలు మరింతగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతుండగా.. సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

KGF-2 YASH REMUNARATION

అయితే ఈ సినిమాకు గాను యశ్ రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యశ్ రూ.30 నుంచి రూ.40 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అలాగే సినిమా విడుదల అయిన తర్వాత వచ్చే లాభాల్లో కూడా యశ్ షేర్ తీసుకోనున్నాడట. ఈ సినిమాను హుంబలె సంస్థ నిర్మించగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇక సంజయ్ దత్ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు