నేడు రాకీభాయ్ బ‌ర్త్‌డే.. భార్య స‌మ‌క్షంలో కేక్ క‌ట్‌చేసిన య‌శ్‌!

రాకింగ్‌స్టార్ య‌శ్‌, ప్రశాంత్‌నీల్ కాంబోలో తెర‌కెక్కిన కేజీఎఫ్-1 చిత్రం ఎంతో ఘ‌న‌విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంతో రాకీభాయ్ య‌శ్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ అయ్యాడు. నేడు య‌శ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప్ర‌స్తుతం తాను న‌టిస్తోన్న కేజీఎఫ్-2 టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు. కానీ ఈ చిత్ర టీజ‌ర్‌ను య‌శ్ బ‌ర్త‌డే సంద‌ర్భంగా 10.08 నిమిషాల‌కు విడుద‌ల చేసేందుకు చిత్ర‌బృందం ఏర్పాట్లు చేయ‌గా.. ఒక‌రోజు ముందుగా ఎవ‌రో సోష‌ల్‌మీడియాలో లీక్ చేశారు. దీనిపై య‌శ్ స్పందించ‌గా.. టీజ‌ర్‌ను ఎవ‌రో మ‌హానుభావుడు ముందే విడుద‌ల చేశాడు.

YASH BIRTHDAY CELEBRATIONS

అలా విడుద‌ల చేయ‌డం ద్వారా వారికి ఏం లాభం చేకూరుతుందో నాకు తెలియ‌దు. దేవుడు వారికి అంతా మంచి చేయాల‌ని వీడియోలో చెప్పుకొచ్చారు. ఇక త‌న భ‌ర్త్‌డేను పుర‌స్క‌రించుకుని అత‌ని భార్య రాధిక పండిట్‌, త‌మ ఇద్ద‌రు పిల్ల‌ల స‌మ‌క్షంలో కేక్ క‌ట్ చేయించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో య‌శ్ త‌న భార్య‌తో క‌లిసి బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకుంటూ సంతోషంగా క‌నిపించాడు. కేక్ క‌ట్ చేసి త‌న భార్య‌కు తినిపించాడు. దీంతో సోష‌ల్‌మీడియాలో ఈ ఫోటోలు వైర‌ల్ కాగా.. య‌శ్ అభిమానులు, కేజీఎఫ్ టీం, అనేక మంది సిని ప్ర‌ముఖులు అత‌నికి బ‌ర్త్‌డే విషేస్ తెలియ‌జేశారు.