
మనిషా ఆర్ట్స్ బ్యానర్ పై అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా పవన్కేతి రాజు దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం ఎల్ వై ఎఫ్. తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్తో ఏప్రిల్ నాలుగో తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల వస్తున్న సందర్భంగా మీడియా వారికి ప్రీమియర్ షో వేయడం జరిగింది. శ్రీ హర్ష, కసిక కపూర్ జంటగా నటిస్తూ ఎస్పీ చరణ్ తండ్రి పాత్ర పోషిస్తూ ప్రవీణ్, రఘు బాబు, చత్రపతి శేఖర్, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్, బంటి తదితరులు కీలకపాత్ర పోషించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామస్వామి రెడ్డి మాట్లాడుతూ… “నేను మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమానిని. మా అబ్బాయి సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు ఎంతో సంతోషించాను. చిరంజీవి గారిని చూస్తూ పెరిగిన నా కొడుకు కూడా అంత గొప్ప నటుడు అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం కోసం ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరి ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఈ చిత్రం చూసిన మీడియా వారంతా ఎంతో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. చిత్రం మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను” అన్నారు.
మనిషా ఆర్ట్స్ నిర్మాత మాట్లాడుతూ… “అమ్మ సెంటిమెంట్తో మా బ్యానర్ పైకి వచ్చిన యమలీల చిత్రం ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. ఇప్పుడు నాన్న సెంటిమెంట్తో వచ్చిన ఈ లవ్ యువర్ ఫాదర్ చిత్రం కూడా అంతే స్థాయిలో మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. ఈ చిత్రం చూసిన వారంతా చాలా బాగుంది అని తమ ఉద్దేశం తెలియజేయడం జరిగింది” అన్నారు.
హీరో శ్రీ హర్ష మాట్లాడుతూ… “ఈ చిత్రం చూసి నన్ను ఆశీర్వదించేందుకు వచ్చిన మీరా వారందరికీ నా నమస్కారం. చిత్రం కోసం మేము ఎంతో కష్టపడ్డాము. వీడెవరు అందరికీ నచ్చిందని వారి సైడ్ నుండి ఎంతో పాజిటివ్గా రెస్పాన్స్ రావడం నాకు నేను పడిన కష్టమంతా మరిచిపోయి ఎంతో సంతోషపడే విధంగా అనిపించింది. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా థాంక్స్. ముఖ్యంగా చిత్రంలో నాకు తండ్రిగా నటించిన ఎస్పీ చరణ్ గారికి అలాగే మా నాన్నగారికి నేను ఎంత రుణపడి ఉంటాను” అన్నారు.
ఈ సందర్భంగా ప్రీమియర్ షోస్ ద్వారా సినిమాని చూసిన మీడియా వారు సినిమా అంతా అద్భుతంగా ఉందని స్పందనను తెలిపారు. చిత్రం టెక్నికల్ గా అలాగే నటనపరంగా ప్రతి విషయంలోనూ ఎంతో బాగుందని శ్రీహర్ష కొత్త నటుడిలా అనిపించలేదని తన పెర్ఫార్మన్స్ తో ఎంతో ముప్పించారని వారు తెలిపారు. అలాగే నిర్మాణ విలువలు దర్శకత్వపు ఆలోచనలు ఎంత అద్భుతంగా ఉన్నాయని తెలిపారు.