Tollywod: త‌మ‌న్నా చేతుల మీదుగా సిధ్‌ శ్రీ‌రామ్ మ‌రో ఆణిముత్యం.. నైలు న‌ది ధార‌లాగా..

Tollywod: ప్ర‌ముఖ సింగ‌ర్ సిధ్ శ్రీ‌రామ్ అంటేనే యూత్‌లో ఎంతో క్రేజ్ నెల‌కొంటుంది. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్, విక్ర‌మ్ హీరోగా తెరకెక్కించిన‌ ఐ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్. రెహ‌మాన్ సంగీతం అందించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమాలో సిధ్ శ్రీ‌రామ్ ఆల‌పించిన ఓ పాట.. యూత్ హృద‌యాల‌ను కొల్ల‌గొట్టేసింది. ఈ పాట ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది సిధ్‌కు. అలాగే తెలుగులో సిధ్ ఆల‌పించిన సాంగ్స్‌..

www movie song

Tollywod ముఖ్యంగా అల వైకుంఠ‌పురంలోని సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌, 30రోజుల్లో ప్రేమిచండం ఎలా సినిమాలోని నీలి నీలి ఆకాశం సాంగ్స్ కుర్ర‌కారును ఊర్రుతూలుగించింది‌. కాగా తాజాగా మ‌రో అద్భుత‌మైన క్లాసిక్‌తో తెలుగు సినీ సంగీత ప్రియుల‌ను అల‌రించేందుకు సిధ్ రెడీ అయ్యాడు. క‌ళ్యాన్‌రామ్ న‌టించిన 118 చిత్రంTollywod యొక్క సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహాన్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం WWW (ఎవ‌రు..ఎక్క‌డ‌..ఎందుకు). Tollywod ఈ థ్రిల్ల‌ర్ మూవీలో ఆదిత్ అరుణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్ల్‌గా న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా సంబంధించిన టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. అయితే ఈ సినిమాలోని ఓ పాట‌ను తాజాగా రిలీజ్ చేశారు.. ప్ర‌ముఖ గేయ‌ర‌చ‌యిత రామ‌జోగ‌య్య‌శాస్త్రి లిరిక్ అందించ‌గా..Tollywod స్టార్ సింగ‌ర్ సిధ్ శ్రీ‌రామ్‌- క‌ళ్యాణి నాయ‌ర్- ప‌ద్మ‌జ ఆల‌పించిన.. నైలు నైది ధారాగా.. మెలోడి సాంగ్‌ను ప్ర‌ముఖ హీరోయిన్ త‌మ‌న్నా చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌న్నా మాట్లాడుతూ.. సిధ్ శ్రీ‌రామ్ పాడిన పాట‌లు అన్ని బాగుంటాయి.. ఇప్పుడు ఈ పాట కూడా ఎంతో అద్భుతంగా ఉంద‌ని కితాబిచ్చింది. Tollywod అలాగే స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ గుహాన్ తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం మంచి విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉండ‌గా.. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానుంది.