Haryana: దంగ‌ల్ రెజ్ల‌ర్స్‌ గీతా, బ‌బితా ఫోగ‌ట్ సోద‌రి ఆత్మ‌హ‌త్య‌..

Haryana: బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమీర్‌ఖాన్ న‌టించిన దంగ‌ల్ సినిమా గుర్తుంది క‌దా.. ఈ సినిమా నిజ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ద్రోణాచార్య అవార్డు విన్న‌ర్ అయిన ప్ర‌ముఖ రెజ్ల‌ర్ మ‌హావీర్ సింగ్, ఆయ‌న కూతుళ్లు ప్ర‌ముఖ రెజ్ల‌ర్లు గీతా, బ‌బితా ఫోగాట్‌ల జీవితం ఆధారంగా దంగ‌ల్ చిత్రం రూపుదిద్దుకుంది.. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి క‌లెక్ష‌న్ల సునామీ కురిపించింది. దీంతో మ‌హావీర్ సింగ్ ఫ్యామిలీకి ఎంతో గుర్తింపు తీసుకుచ్చింది. కాగా ఈ ఫ్యామిలీలో తాజాగా విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

rithika fogot suicide

గీతా, బ‌బితా ఫోగాట్ సోద‌రి రితికా ఫోగాట్ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. గురువారం తెల్ల‌వారుజామున జ‌రిగిన దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న రెజ్లింగ్ ఫ్యాన్స్‌ను ఎంతో క‌లిచివేసింది. భ‌ర‌త్‌పూర్‌లో బుధ‌వారం జ‌రిగిన ఓ టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఓడిపోయింద‌న్న బాధ‌లో ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. రితికా ఫోగాట్ వ‌య‌స్సు 17ఏళ్లు. రెజ్లింగ్ లో పేరు గాంచిన కుటుంబం నుంచి వ‌చ్చిన ఆమె రాష్ట్ర స్థాయి స‌బ్ జూనియ‌ర్‌, జూనియ‌ర్ టోర్నీల్లో ఆడుతోంది. ఫైన‌ల్‌లో కేవ‌లం ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయింద‌న్న బాధ‌లో ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంది అని హర్యానాలోని చ‌ర్ఖి దాద్రి జిల్లా ఎస్పీ రామ్‌సింగ్ బిష్ణోయ్ తెలిపారు.