ఈరోజు డాక్టర్ రావు డెంటల్ హాస్పిటల్, అమీర్ పెట్ నందు వరల్డ్ నో టు టోబాకో డే డాక్టర్ నాగేశ్వర్ రావ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెకరెట్రీ గారైన శ్రీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు హాజరయ్యి బ్యానర్ ను ఆవిష్కరించారు. అలాగే మరికొంతమంది ఈ ప్రోగ్రామ్ కు హాజరు అయ్యారు. శ్రీ జయరాజ్ మరియు స్టోరీ రైటర్ బుల్లెపల్లి మోహన్, మ్యూజిక్ డైరెక్టర్ & సింగర్ శ్రీ నయుమ్ గారు ఈసీ మెంబెర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ శ్రీ కనుమ బోగరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ…
పొగాకు ఎంతో మంది జీవితాల్లో సమస్యగా మారింది. పొగాకు వల్ల జరిగే అనర్థాలు, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇకనైనా పొగాకు తాగేవారు తమ అలవాటును మానుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు.
శ్రీ జయరాజ్ మాట్లాడుతూ…
పొగాకు కాన్సర్ కు కారణము అవుతుంది, పొగాకు తాగేవారే కాకుండా పక్కన ఉన్నవారు కూడా దెబ్బతింటారు, పక్కవారికి కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
శ్రీ బుల్లెపల్లి మోహన్ మాట్లాడుతూ…
మేము ఈ పొగాకు పైన ఒక పాటను తయారు చేశాము, ఇకమీదట కొంతమంది అయినాసరే సిగరెట్, గుట్కా అలవాటు ఉన్న వారు మారుతారని ఆశిస్తూన్నట్లు తెలిపారు.
ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈసీ మెంబెర్ నయుమ్ మాట్లాడుతూ…
రావు గారు చాలా సినిమాలు ఆర్టిస్ట్ గా చేశారు, గత కొంత కాలం నుండి ఆయనతో మాకు సాన్నిహిత్యం ఉంది, ఆయన ఫ్రీ సర్వీస్ చేస్తూ పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. డెంటల్ పై గాని ఇతర ఆరోగ్య అలవాట్ల పై అవగానే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంటారు ఆయన ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ…
నేను గాంధీ ఆసుపత్రిలో ప్రొఫెసర్ గా పని చేశాను, దాదాపు 38 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఈ పొగాకు పంటను రైతులు అవాయిడ్ చేస్తే బాగుంటుంది, సిగరెట్, పాన్, గుట్కా వల్ల కలిగే అనర్థాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయని తెలిపారు.
డాకర్ రావు గారు వరల్డ్ నో టు టోబ్యాకో డే పోస్టర్ ను అమీర్ పేట్ మెయిన్ రోడ్ లో డిస్ ప్లే చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.