ఈ వయసులో కూడా అమితాబ్ బచ్చన్ ప్రయోగాలు చూడండి

బిగ్ బి అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న మొదటి సినిమా గులాబో సితాబో. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ వర్కింగ్ స్టిల్ రిలీజ్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది. షూజీత్ సర్కార్ దర్శకత్వం వహిస్తున్న గులాబో సితాబో వర్కింగ్ స్టిల్ లో అమితాబ్ తెల్ల పైజామాపై పచ్చ రంగు కుర్తాతో కనిపిస్తున్నాడు. కళ్ల జోడు, నెరిసిన గడ్డంతో చూడగానే గుర్తు పట్టలేనంత మేకవర్ తో అమితాబ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. పైగా గులాబో సితాబో సినిమాలో అమితాబ్ బాగా డబ్బున భూస్వామి పాత్ర చేస్తున్నాడు. అలాంటి భూస్వామిగా ఇలాంటి గెటప్ లో ఉండడం ఏంటి అనేది ఎవరికీ అర్ధం కావట్లేదు.

అమితాబ్ పక్కనే నిలబడిన ఆయుష్మాన్ కూడా తెల్ల పైజామా, గీతల చొక్కాతో మామూలు సాధాసీదా కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరు ఇంత నార్మల్ గా ఉండడానికి కారణం ఏంటి అనేది గులాబో సితాబో సినిమాలోనే చూడాలి. ఇప్పటికైతే ఈ వర్కింగ్ స్టిల్ చూసిన వాళ్లు మాత్రం అమితాబ్ అండ్ ఆయుష్మాన్ ఖురానా న్యూ మేకోవర్ చూసి షాక్ అవ్వడమే కాకుండా కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు.