రోబరీ హీరోతో…రోబరీ డైరెక్టర్ కొత్త చిత్రం…

అభిషిక్త్ కాలిశెట్టి,హారిక హీరో హీరోయిన్లుగా శ్రీవారి క్రియేషన్స్ లో బ్యానర్ లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్- 6 చిత్రం ఓపెనింగ్ ఇటివలే తణుకు లోని శ్రీ శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఘనంగా జరిగింది.
చిత్ర బృందం అందరూ హాజరయ్యారు.
కార్యక్రమం లో చిత్ర దర్శకుడు శరగడం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ చిత్రం యాక్షన్, రొమాంటిక్ లవ్, సెంటిమెంట్, కామెడీలతో ఉంటుందని,ఇటు క్లాసుని, అటు మాస్ ని అందర్నీ ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నామని,
మొదటి షెడ్యూల్ ఈనెల 4 నుండి 15 వరకు తణుకు, హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుందని, రెండో షెడ్యూల్ 18 నుండి 26 వరకు కాకినాడ,యానం, దిండిలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఖర్చుతో తెరకెక్కిస్తున్నామని,
ఇక మూడో షెడ్యూల్ చిత్రంలో ఉన్న మూడు సాంగ్స్ ని అందమైన లోకేషన్ లో చిత్రకరించాలని సన్నాహాలు చేస్తున్నామని, దాంతో ఈ చిత్ర షూటింగ్ పూర్తి అవుతుందని తెలిపారు.
ఈ చిత్రం నటీనటులు…. పరమహంస, బన్నా, మహేష్,కృష్ణారావు, సురేష్,దొరబాబు,…
సమర్పణ – అప్పల నరసమ్మ, నాగు నాయుడు. కెమెరా- యాదగిరి.
మాటలు – నండూరివీరేష్, సుధీర్.
కథ- శ్రీవారి క్రియేషన్స్.
ఎడిటర్ -నాగిరెడ్డి.
మ్యూజిక్- సందీప్.
ఫైట్స్ -దేవరాజ్
నిర్మాతలు- ఎస్ సుధీర్, ఎస్ శ్రీనివాస్.
స్క్రీన్ ప్లే,
డైరెక్షన్ -శ్రీనివాస్ శరగడం.