సైరా లెంగ్త్ దాని రిజల్ట్ పై పడుతుందా?

సైరా లెంగ్త్ దాని రిజల్ట్ పై పడుతుందా? ఇప్పుడు ఇదే ప్రశ్న అనుమానమై మెగాభిమానుల మీద పడింది. ఒకప్పుడు సినిమా దాదాపుగా రెండు గంటల నలభై నిమిషాల నుంచి మూడు గంటల సేపు ఉండేది. మెల్లగా సినిమా నిడివి తగ్గుతూ వచ్చి రెండున్నర గంటలు, ఆ పై రెండు గంటలు, చివరికి ఒక గంట నలభై ఐదు నిమిషాలకు పడిపోయింది. సినిమాని సాగదీయడం ఇష్టం లేక, ఆడియన్స్ కి క్రిప్సీగా అనుకున్నది చెప్పడానికి మేకర్స్ ఇలా చేస్తూ వచ్చారు. సినీ అభిమానులు కూడా మూడు గంటల పాటు సినిమాని చూసే రోజులు మర్చిపోయారు. అయినా సరే ఈ రోజుల్లో కూడా తమ కథల మీద, హీరోల మీదా నమ్మకమున్న దర్శకులు సినిమా నిడివితో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మి మూవీస్ చేసి హిట్స్ అందుకుంటున్నారు.

Sye Raa Narasimha Reddy Teaser Launch Event

దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాహుబలి… రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా నిడివి పెద్దది అయినా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. తర్వాత రంగస్థలం, శ్రీమంతుడు, భరత్ అనే నేను వగైరా వగైరా మూవీలు. డ్యూరేషన్ ఎక్కువ అయినా సరే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి సక్సెస్ సాధించాయి. ఇందులో ఇంకో విషయం కూడా ఉండండి. కథలో దమ్ము లేకపోతే… ఎంత పెద్ద దర్శకుడైనా, హీరో అయినా, కథలో దమ్ము లేకుండా లాగ్ వుంటే రిజల్ట్ తేడా కొడుతుంది. ఆ సత్యాన్ని గూబగుయ్యి మనిపించేలా జవాబిచ్చిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.

భారీ బడ్జెట్ అని చెబుతూ బొక్కబోర్లా పడిపోయిన పొడవైన తెలుగు సినిమాల రిజల్ట్ ని మర్చిపోయి, తమ కథని మాత్రమే నమ్మిన సైరా చిత్ర యూనిట్, ఈ సినిమా నిడివిని రెండు గంటల 45 నిమిషాలకి అంటే 165 నిమిషాలుగా ఫిక్స్ చేశారట. సైరా సినిమా బడ్జెట్ పరంగా చూస్తే సినిమాలో ప్రతి నిమిషానికి దాదాపుగా ఒకటిన్నర కోటి పెట్టి తీశారన్నమాట. ఇంత భారీ స్థాయిలో తెరకెక్కిన సైరా సినిమాకి ఉయ్యాలవాడ కథే బలం, కథనం ప్రత్యేకం… పై పైన అద్దిన ప్రతి హంగు, సినిమా స్థాయిని పెంచేదే కావడంతో సైరా సినిమా రిజల్ట్ కి డ్యూరేషన్ కి సంబంధం లేదు.