ఇద్దరి లోకం ఒక్కటే, ఆ ఇద్దరికీ కంబ్యాక్ సినిమా అవుతుందా?

హిట్ కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు కలిసి కసిగా పని చేస్తే దాని ఔట్పుట్ ఎలా ఉంటుందో ఇస్మార్ట్ శంకర్ ప్రూవ్ చేసింది. పూరి, రామ్ లు ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడే ఇదే సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకోని హీరో రాజ్ తరుణ్ కూడా ఫ్లాప్స్ లో హీరోయిన్ షాలిని పాండేని కలుపుకోని ఇద్దరి లోకం ఒకటే సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో జిఆర్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.

iddari lokam okkate

దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ఉన్న ప్రధాన బలం దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఇద్దరి లోకం ఒకటే సినిమాని నిర్మిస్తున్నాడు. ఫీల్ గుడ్ సినిమాలు తీయడంలో దిట్ట అయిన దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక మూవీ వస్తుంది అంటే సినీ అభిమానుల్లో కొన్ని అంచనాలు మొదలవుతాయి. వీటికి తగ్గట్లు మంచి కంటెంట్ కూడా పడితే సినిమా హిట్ అవుతుంది. మరి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ ఇద్దరి లోకం ఒక్కటే సినిమా రాజ్ తరుణ్ కి, షాలిని పాండేకి ఇమ్మిడియట్ గా అవసరమైన హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాని చిత్ర యూనిట్ నవంబర్ 15న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.