రామ్ చరణ్, రాజమౌళిలకి ఎన్టీఆర్ సవాల్ విసురుతాడా?

ntr charan rajamouli

ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉండి, తనపని తాను చేసుకుంటూ పోతున్న ఎన్టీఆర్ కే ఒక యాంకర్ సవాల్ విసిరింది. టైగర్ లా ఉండే ఎన్టీఆర్ కి సవాలా? ఏంటా సవాల్? ఎవరిచ్చారు ఆ సవాల్ అంటూ ఆశ్చర్యపోకండి. తారక్ సవాల్ విసిరింది యాక్టివ్ యాంకర్ సుమక్క, అది కూడా మొక్కలు నాటాలి అనే గ్రీన్ ఛాలెంజ్ లెండి. రకరకాల ఛాలెంజులు వస్తున్న టైములో రీసెంట్ గా రాజీవ్ కనకాల ఈ గ్రీన్ ఛాలెంజ్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు సుమ కూడా మొక్కలు నాటి, కనకాల ఫ్యామిలీతో మంచి రిలేషన్ ని మైంటైన్ చేసే ఎన్టీఆర్ కి ఈ గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చింది.

హరిత ఉద్యమంలో భాగంగా సహజ నటి జయసుధ చేసిన సవాల్‌ను స్వీకరించిన సుమ బుధవారం బేగంపేటలో మొక్కలు నాటారు. అశోక, వేప, కదంబం మొక్కలు నాటిన సుమ… ఎన్‌టీఆర్‌తో పాటు మంచులక్ష్మీ, రాహుల్ సిప్లిగంజ్, ఓంకార్‌లకు గ్రీన్‌ చాలెంజ్‌ విసిరింది. కాగా, హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ రాష్ట్ర పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ గ్రీన్‌ చాలెంజ్‌ విసిరిన సంగతి తెలిసిందే. మరి షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్, ఈ గ్రీన్ ఛాలెంజ్ ని ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు? తను మళ్లీ చరణ్ అండ్ రాజమౌళిని ఛాలెంజ్ చేస్తాడా అనేది చూడాలి.