కొత్తగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఈ గ్యాంగ్ స్టర్స్

రజినీకాంత్-మోహన్ బాబు ఈ ఇద్దరి పేర్లు వినగానే సూపర్ స్టార్ ని కూడా ఒరేయ్ అని పిలిచే అంత స్నేహం గుర్తొస్తుంది. ఎంత బిజీగా ఉన్నా మన వాళ్లతో సమయం గడపాలి అనే ఆలోచన కలుగుతుంది. రజినీ ఎంతో బిజీగా ఉన్న మోహన్ బాబుతో టైం స్పెండ్ చేస్తాడు, అతను హీరో అనేది మర్చిపోయి స్నేహితుడితో గడుపుతాడు. వాళ్ల ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి మోహన్ బాబు చాలా సార్లు చెప్పాడు.

రీసెంట్ గా రజినీకాంత్ అన్నాత్తె షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. షూటింగ్ పూర్తి చేసుకోని చెన్నై తిరిగి వెళ్తూ రజినీకాంత్ మోహన్ బాబుని కలిసి వెళ్లాడు. ఈ సమయంలో వీరు తీసుకున్న ఫొటోలను మంచు విష్ణు ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ‘The OGs. Original Gangsters! And then goofy Vishnu Manchu’ అనే క్యాప్షన్ తో పిక్స్ షేర్ చేసిన విష్ణు, అందరికీ పాత రోజులని గుర్తు చేశాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్సింగ్ లో స్టైలిష్ గా జరిగిన ఫొటోషూట్ లో పాత మిత్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో 1995లో వచ్చిన పెదరాయుడు సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్’ అని పేరు పెట్టి ఓ సినిమా తీస్తే మస్త్ ఉంటది. హీరో అండ్ ప్రొడ్యూసర్ అయిన విష్ణు ఆ వైపు ఆలోచించి, ఈ ఒరిజినల్ గాడ్స్ ని ఒకే తెరపై చూపించే ఆలోచన చేస్తే బాగుంటుంది.