కరోనా నుంచి కోలుకుని.. త్వరలోనే ప్లాస్మాను దానం చేస్తా: సింగర్ స్మిత

smitha

తెలుగు పాప్ సింగర్ స్మిత కూడా కరోనావైరస్ భారిన పడ్డారు. ఇటీవల పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇదే విషయాన్ని వెల్లడించారు. నిన్న వ్యాయామం చేస్తున్నప్పుడు బలహీనంగా ఉందని తెలిపిన స్మిత.. మనసులో అనుమానంగా అనిపించి కరోనా పరీక్షలు చేయించుకున్నారట.

వెంటనే కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినట్లు తెలుపుతూ.. తన భర్త శశాంక్ కి కూడా COVID-19 పాజిటివ్ అని వచ్చినట్లు తెలిపింది. మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయించగా వారికి నెగెటివ్ వచ్చిందని స్మిత తెలిపారు. ఇక ప్రస్తుతం తాము బాగానే ఉన్నట్లు చెబుతూ.. వీలైనంత త్వరగా కరోనా నుండి బయటకు వస్తానని మరియు ప్లాస్మాను దానం చేయాలని కోరుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు. ఇటీవల కాలంలో సింగర్ స్మిత హై రబ్బా మరియు బాహుబలి సినిమాలోని ఒక ప్రత్యేకమైన పాటతో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.