Nagarjuna: ఇన్నాళ్ల‌కు నాగార్జున వైల్డ్‌డాగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారా..

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన తాజా చిత్రం వైల్డ్‌డాగ్.. ఈ చిత్రానికి నూత‌న డైరెక్ట‌ర్ అహిష‌ర్ సోల‌మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో దియా మీర్జా, సైయామీ ఖేర్‌, అతుల్ కుల‌క‌ర్ణి, అలీరెజా, బిలాల్ హుస్సేన్, ప్ర‌కాశ్ సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు న‌టించారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్లు, టీజ‌ర్ ప్రేక్ష‌కుల్లో ఎంతో ఆస‌క్తి క‌న‌బరిచాయి.. దీంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి తాజా అప్‌డేట్ ప్ర‌క‌టించింది Nagarjuna చిత్ర‌బృందం. ఏప్రిల్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా నాగార్జున మాట్లాడుతూ..

nag movie

ఓ ప్ర‌ముఖ ఓటీటీ వారు త‌మ మూవీ టీంను క‌లిశారు. థియేట‌ర్స్ ఓపెన్ అయితే జ‌నాలు వ‌స్తారో రారో అనే సందేహంతో ఓటిటి రిలీజ్‌కు ఓకే చెప్పెసాం. కానీ సంక్రాంతి కి క్రాక్ సినిమా విడుద‌లై సూప‌ర్‌హిట్ అయింది. అలాగే ఫిబ్ర‌వ‌రిలో ఉప్పెన రిలీజ్ అయి భారీ విజ‌యం ద‌క్కించుకుంది. ఈ రెండు చిత్రాల‌కు భారీ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి కూడా.. అప్పుడే మేం కూడా ఓటిటి కాద‌ని థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేద్దామ‌ని నిర్ణ‌యించామ‌ని తెలిపారుNagarjuna. ఇది నిజ‌జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతుంది. హైద‌రాబాద్ సంచ‌ల‌నం సృష్టించిన ఓ రియ‌ల్‌లైఫ్ టెర్ర‌ర్ దాడిని ఎన్ఐఏ బృందం ఎలా చేసింది అనే క‌థాంశంతో ఈ చిత్రం రూపొందుతుంది. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు.