Tollywood: విక్ట‌రీ వెంక‌టేశ్ అంటే నాకు ప్రాణం: నాగార్జున‌ హీరోయిన్

Tollywood: టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం వైల్డ్‌డాగ్‌. ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.. ఈ చిత్రానికి అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో.. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో స‌యామీ ఖేర్‌, దియా మీర్జా, బిగ్‌బాస్ ఫేం అలీ రెజా త‌దిత‌రులు న‌టిస్తున్న చిత్రానికి మ్యూజిక్ త‌మ‌న్ అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.. కాగా హైద‌రాబాద్‌లోని కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌నల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇక ఈ చిత్రం రిలీజ్ కు స‌న్న‌ద్ధం అవుతున్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించారు చిత్ర‌బృందం.. ఈ క్ర‌మంలో వైల్డ్‌డాగ్ హీరోయిన్ దియా మీర్జా తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ సినిమా గురించి తెలుపుతూ..

నేను ముంబ‌యిలో ఉన్న‌ప్పుడు వైల్డ్‌డాగ్ చిత్ర‌బృందం న‌న్ను సంప్ర‌దించి.. ఈ క‌థ వినిపించింది. విన్న వెంట‌నే ఈ ప్రాజెక్టుని ఓకే చేశాను. అంత‌లా న‌న్ను ఆక‌ట్టుకుంది.. స్ర్కిప్ట్‌, ద‌ర్శ‌కుడి ఎన‌ర్జీ, ఈ అంశాలు న‌న్ను బాగా ప్ర‌భావితం చేశాయి. ఇక నాగార్జునతో పనిచేయ‌డం చాలా కంప‌ర్ట్‌గా అనిపించింది. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం ఆయ‌నది.. నేను హైద‌రాబాద్‌లోనే పుట్టాను.. నాగార్జున అంటే చాలా ఇష్టం.. ఈ ఇష్టం ఆయ‌న ఫ్యామిలీతో కూడా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇక నాకొక ఒక క‌ల‌.. నా అభిమాన న‌టులు విక్ట‌రీ వెంక‌టేశ్‌, కింగ్ నాగార్జున‌.. నాగార్జ‌న‌తో క‌లిసి న‌టించే క‌ల నేర‌వేరింది. ఇక వెంక‌టేశ్ చిత్రంలో న‌టించే క‌ల ఒక్క‌టే మిగిలి ఉంది అని చెప్పుకొచ్చింది దియా మీర్జా.‌‌