ఓటీటీలో విడుదల కానున్న నాగార్జున సినిమా?

నాగార్జున హీరోగా సాల్మన్ తెరకెక్కిస్తున్న వైల్డ్ డాగ్ సినిమాకు సంబంధించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఎన్‌ఐఏ ఏజెంట్‌గా నాగార్జున నటిస్తుండగా.. దియా మీర్జా, నయామీ ఖేర్‌లు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే లాక్‌డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వగా.. పూర్తి షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అయితే ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

wilddog

నెట్‌ఫిక్స్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సినిమాకు అయిన బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టి ఆ కొనుగోలు చేసేందుకు నెట్‌ఫిక్స్ ముందుకు వచ్చిందట. దీంతో మేకర్స్ ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో విడుదల చేసినా.. కరోనా ప్రభావం క్రమంలో ప్రేక్షకులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఓటీటీ వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు.

అయితే కొంతమంది మాత్రం వైల్డ్ డాగ్ సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. నాగార్జున వంటి హీరోలు ఓటీటీలో విడుదల చేస్తే థియేటర్లకు అన్యాయం చేసినట్లు అవుతుందని చెబుతున్నారు. మరి చూడాలి ఏం అవుతుందో..