ఏఎన్నార్ అవార్డ్స్ కి అక్కినేని కోడలు డుమ్మా, కారణం ఏంటి?

అక్కినేని ఈవెంట్ ఏం జరిగినా ఫ్యామిలీ అంత కలిసి ఎంజాయ్ చేస్తారు. పర్సనల్ లైఫ్ ని, ప్రొఫెషనల్ లైఫ్ ని బాలన్స్ చేయడం అక్కినేని ఫ్యామిలీని చూసే నేర్చుకోవాలి అనిపిస్తుంది. అయితే రీసెంట్ గా ఏఎన్నార్ అవార్డ్స్ జరిగాయి. ఎప్పటిలాగే ఈ అవార్డు సెరిమొనికి అక్కినేని ఫ్యామిలీ అంతా వచ్చి సందడి చేశారు. చిరు చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఈవెంట్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున కోడలు కనిపించకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. నాగ చైతన్య వైఫ్, అక్కినేని కోడలుగా ఈవెంట్ కి ఖచ్చితంగా రావాల్సిన సమంత ఎందుకు రాలేదు అంటూ క్వేషన్స్ విన్పిస్తున్నాయి.

సమంత లోటు కనిపించిందని కొందరు అంటుంటే, ఇంతకీ ఆమె అసలు ఎందుకు కనిపించలేదు అనే వాళ్లు కూడా ఉన్నారు. సమంత నటిస్తున్న సినిమాల షూటింగ్స్ కూడా ఇప్పుడు ఏమీ లేవు కదా అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు. సమంత ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది, దాని షూటింగ్ కారణంగానే సమంత ఈ కార్యక్రమానికి హాజరు కాకపోయి ఉండవచ్చు అంటున్నారు. సమంత ఏఎన్నార్ అవార్డ్స్ కి ఎందుకు రాలేదు అనే రీజన్, ఆ ఫ్యామిలీకి తప్ప పర్ఫెక్ట్ గా ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి తోచిన కారణం వాళ్లు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా అక్కినేని ఫ్యామిలీ అంతా ఉన్న చోట సమంత లేకపోవడం చిన్న లోటుగానే కనిపించింది.