ఆ భారీ ప్రాజెక్ట్ లో రావణుడు ఎవరు?

బాహుబలి సినిమాలో ప్రభాస్, రానాలు ఫైట్ చేస్తుంటే ఆ పర్సనాలిటీలని తెరపై చూసిన వాళ్లు నిజంగానే ఇద్దరు సమఉజ్జిలు కొట్టుకుంటే ఇలా ఉంటుందా అనే ఫీల్ అయ్యారు. రానా, ప్రభాస్ ల ఆకారాలు బాహుబలి రేంజ్ పెంచడంలో ఎంతో ఉపయోగ పడ్డాయి. ఇప్పుడే ఇండియన్ హల్క్స్ ప్రభాస్ – హ్రితిక్ కూడా ఫాలో అవనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరినీ హీరో విలన్లుగా పెట్టి రామాయణం సినిమా రాబోతుందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించబోయే రామయంలో హ్రితిక్ రోషన్ రాముడిగా, ప్రభాస్ రావణుడిగా కనిపించబోతున్నారని టాక్ నడుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారి తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్ట్ మూడు భాగాలుగా రాబోతుందని హృతిక్ రోషన్ ను రాముడిగా మరియు దీపికా పడుకొనే ను సీత పాత్రలో కన్ఫార్మ్ చేసేశారని అనుకుంటున్నారు. మరి రాముడు, సీత ఉన్నప్పుడు రావణాసురుడు లేకుండా ఎలా? అందుకే ఆ పాత్ర కోసం మన బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్ ని ప్రస్తుతానికి అనుకున్నారట. ప్రభాస్ పర్సనాలిటీకి రావణాసురుడి క్యారెక్టర్ సరిగ్గా సూట్ అవుతుందని బాహవించిన ఇప్పటికే చిత్రబృందం ప్రభాస్ తో సంప్రదింపులు జరుపుతున్నారట.

ఇండియన్ సినీ హిస్టరీలోనే మొదటిసారి 600 కోట్ల భారీ బడ్జట్ తో ట్రియోలజీగా రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అనే వార్త కూడా బయట చక్కర్లు కొడుతుంది కాబట్టి రావణుడి లాంటి క్యారెక్టర్ ని పౌరాణికాల్లో పట్టున్న ఎన్టీఆర్ మాత్రమే చేస్తాడని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి ఎవరి ఎన్ని లెక్కలు వేసుకున్నా అది గాలి వార్తలాగే మిగులుతుంది.