
నటి స్నేహ ఇటీవలే తన భర్తతో కలిసి అరుణాచలం వెళ్లారు. అక్కడ కొండ చుట్టూ ప్రదర్శనలు చేసేందుకు తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో మొదలయ్యారు. అక్కడి భక్తులతో కలిసి గిరిప్రదక్షిణ చేస్తూ కనిపించిన ప్రతి గుడిలో కొబ్బరికాయ కొడుతూ ఎంతో ప్రశాంతంగా వారి ప్రదక్షిణలు సాగాయి. ఇదే మాదిరిగా ఇటీవల కాలంలో కొంతమంది సెలబ్రిటీలు అరుణాచలంలో గిరిప్రదక్షిణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇరువురు దంపతులు గిరి ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో చెప్పులు ధరించారు. దానితో భక్తులంతా వారు మహాపాపం చేశారంటూ మండిపడుతున్నారు. అంతటి పవిత్రమైన గిరిప్రదక్షిణలు చేసేటప్పుడు చెప్పులు వేసుకోవడం ఏంటంటూ విడుదరిని విమర్శిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఎటువంటి కాంట్రవర్సీలను కనిపించని స్నేహ నేడు అరుణాచలం గిరి ప్రదక్షణల విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు.