ఇంతకీ ఎప్పుడొస్తావ్ చిన్నవాడా?

నిఖిల్ సిద్దార్థ్… కెరీర్ స్టార్టింగ్ లో ఒడిదుడుకులు ఎదురుకున్నా కూడా రీసెంట్ గా మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి వరస హిట్స్ కొట్టి క్లోజ్ అయిపోయే ప్రమాదంలో ఉన్న కెరీర్ ని సేఫ్ జోన్ లోకి తెచ్చుకున్నాడు. నిఖిల్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మంచి విషయం ఉంటుందనే కాన్ఫిడెన్స్ లో సినీ అభిమానులు ఉంటారు.. అయితే ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత నిఖిల్ కి సరైన హిట్ లేదు. ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని కాస్త టైం తీసుకొని చేస్తున్న సినిమా ముద్ర… ఫస్ట్ లుక్, టైటిల్ లోగో తప్ప చిన్న టీజర్ కూడా రిలీజ్ చేయని ఈ సినిమా ఫేక్ సర్టిఫికెట్స్ చుట్టూ తిరుగుతుంది.. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.. ముద్రలో నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు.. కనిదన్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కథే ప్రధాన బలం… నిఖిల్ హిట్ కొట్టడం ఖాయం అనుకుంటున్న టైములో.. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిలే అవుతూనే ఉంది.. నిజానికి ఈపాటికే రిలీజ్ కావాల్సిన ముద్రకి మొదట్లో టైటిల్ కి సంబందించిన వివాదాలు ఎదురయ్యాయి, దాంతో ముద్ర కాస్త అర్జున్ సురవరంగా మారింది.

ముందుగా చెప్పిన టైం ప్రకారం అయితే అర్జున్ సురవరం సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి.. కానీ అది గత ఆరు నెలలుగా వాయిదా పడుతూ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. త్వరలో విడుదల తేదీని చెప్తామని అర్జున్ సురవరం టీమ్ అంటున్నారు కానీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చూస్తే ఇప్పటికైతే అలా చాలా కాలం పాటు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయిన చిత్రాలు బాక్సాఫీస్ దెగ్గర అందరినీ మెప్పించి ఆడిన దాఖలాలైతే తెలుగులో పెద్దగా లేవు… మరి అర్జున్ సురవరంగా నిఖిల్ చరిత్రని తిరగరాసి హిట్ అందుకుంటాడెమో చూడాలి.