థియేటర్ల పున ప్రారంభం పై తెలంగాణా థియేటర్ ఓనర్స్ శనివారం సమావేశమయ్యారు. అక్టోబర్ 15నుంచి కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తుందని అనుకుంటున్నామని చెబుతూ మా ఓనర్స్ అసోసియేషన్ అందరం థియేటర్స్ తెరవాలని నిర్ణయించామని వారు మీడియాకు తెలిపారు.
మాకు కొన్ని రాయితీలు ఇవ్వాలి. పార్కింగ్ విషయంలో, కరెంట్ విషయంలో ప్రభుత్వం సహకరించాలని థియేటర్ ఓనర్స్ చెబుతున్నారు. ఇక థియేటర్ లు తెరవగానే ప్రొడ్యూసర్ లు సినిమాలు రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చు అంటూ ఇది వరకు ఓటీటీ లో రిలీజ్ అయిన సినిమాలు తీసుకుంటాం. చిన్న సినిమాలు, పాత సినిమాలు కొన్ని వేసి చూస్తామని అన్నారు. ఇక మరోవైపు ప్రేక్షకులు కూడా థియేటర్ లో సినిమాలు చూసేందుకు రెడి గా ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.