ఎన్టీఆర్‌-త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్?

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మెర్రీస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

WarinaHussain IN NTR MOVIE

ఈ క్రమంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ వారినా హుస్సేస్ సెకండ్ హీరోయిన్‌గా నటించనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా టెస్ట్ షూట్‌లో ఆమె పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నాడట.